రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు అడుగడుగునా వేస్తున్న తప్పట డుగులు.. ఇప్పుడు మరింతగా ఆయనను ప్రశ్నల సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయి. అధికారం పోయిం ది.. ఎమ్మెల్యేలు సైకి ల్ దిగిపోతున్నారు.. నాయకులు సహకరించడం లేదు.. చెట్టుకొకరు.. పుట్టకొకరుగా తమ్ముళ్లు రాజకీయాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో అందరినీ గాడిలో పెట్టేందుకు చంద్రబాబు.. ఉద్యమా లనే ఊపిరిగా శ్వాసిస్తున్నారు. అయితే, ఇవి కూడా ఫలించడం లేదు. దీంతో ఇప్పుడు బాబు పరిస్థితి అడకత్తెరలో పోకమాదిరిగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాజధాని అమరావతిని నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబుకు ప్రతిష్టాత్మక విషయం. తన జీవితంలో ఇన్నాళ్లు చేసిన రాజకీయాలు ఒక ఎత్తయితే.. ఇప్పుడు రాజధాని కోసం చేస్తున్న రాజకీయాలు మరో ఎత్తు! ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యేందుకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తనను విభేదించి న నాయకులతో ను, పార్టీలతోనూ ఆయన చేతులు కలిపారు. అనుకూల మీడియా అండ ఎలాగూ ఉంది.
ఈ నేపథ్యంలో బాబు తన పోరులో విజయం సాధించడం ఖాయమని అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయన నమ్ముకున్న వారంతా ఒక్కొక్కరుగా ఆయనకు దూరమవుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో కేంద్రాన్ని నమ్ముకున్నారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని, జగన్ దూకుడుకు కళ్లెం వేస్తుందని అనుకున్నారు. కానీ, అలాం టి పరిస్థితి తమకు లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. ఇక, పవన్ కళ్యాణ్ వస్తే.. ఏదో జరిగిపోతుందని బాబు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆయన వెళ్లి .. రాజధానితో తమకు సంబంధం లేదన్న బీజేపీతో చెలిమి చేస్తున్నారు.
ఇక, రాష్ట్రంలో రాజధాని ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితమైందన్న అధికార పార్టీ వైసీపీ నేతల వ్యాఖ్యలే నిజమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు బాబు దాదాపు ఒంటరి అవుతు న్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏం చేయాలి ? ఎలా ముందుకు వెళ్లాలి ? ఈ పోరును కొనసాగించాలా? వద్దా? అనేప్రశ్నల పరంపర కొనసాగుతోంది. 50 రోజుల అమరావతి పోరులో ఇప్పటి వరకు చంద్రబాబు సాధించింది అంగుళమైనా లేదు. మాటల తూటాలు పేల్చడం తప్ప! ఇక, ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం ఈ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేసింది లేదు.. ఎదురు దాడి చేయడం తప్ప!! ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందున్న వ్యూహం ఏంటనేది ఆసక్తిగా మారింది.
అటు కేంద్రానికి సరెండర్ అయిపోతే.. కొంత వరకు మేలు జరుగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా.. బీజేపీ బాబును నమ్మే పరిస్థితి లేదు. పైగా నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేనందున ఆ పార్టీకి బాబుతో చెలిమి అస్సలు అవసరం లేదు. ఇక, మిగిలింది భేషజాలు వదిలి.. సీఎం జగన్‌తో చర్చలకు కూర్చోవడం. ఇది జరిగే పనికాదనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బాబు ముందున్న ఆప్షన్స్ కోర్టులు. ఈ విషయంపైనా చర్చ సాగుతోంది. జగన్ నిర్ణయాలను బాబు కోర్టుల్లో సవాల్ చేసి స్టే ఇప్పించుకోగలిగితే.. ఒక రకంగా మంచిదే అయినా.. అయితే, ఇది సుదీర్ఘ రాజకీయ లబ్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మరి ఆయన ఏం చేస్తారు? చూడాలి!!