శారీరకంగా హింసిస్తారేమో.. మానసికంగా మేం బలంగా ఉన్నాం : చంద్రబాబు

-

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ లను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అంతేకాకుండా.. బీసీ నేత అయ్యన్న ఇంటికి తెల్లవారుజామున గోడ దూకి పోలీసులు వెళ్లారు. అయ్యన్న హత్య చేశారా..? హత్యా రాజకీయాలు చేశారా..? పోలీసులు తాగి గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..? పేదలకు భూములిచ్చిన చరిత్ర అయ్యన్నది. అయ్యన్న కుటుంబం ఇచ్చిన భూముల్లో ఇళ్లు కట్టుకుని అయ్యన్నపాలెం అని పేరు పెట్టుకున్నారు. వేల ఎకరాలు దోచుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది. హైదరాబాదులో స్థలం ఆక్రమించుకుని.. అధికారంలోకి వచ్చాక రెగ్యులరైజ్ చేసుకున్న చరిత్ర వైఎస్ ఫ్యామిలీది.

మంగంపేట బెరైటీస్ గనుల్లో వైఎస్ ఫ్యామ్లీ అక్రమాలను శేషశయనా రెడ్డి హౌస్ కమిటీ, నటరాజన్ కమిషన్ నిజమని చెప్పాయి. బుగ్గవంకను ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్న చరిత్ర జగన్ మేనమామది. వైఎస్ ఫ్యామ్లీ అక్రమాలపై ఫిర్యాదులు చేస్తాం.. చర్యలు తీసుకుంటారా..? కొంత మంది కళంకిత అధికారులు తప్పుడు విధానాలతో వెళ్తున్నారు. కళంకిత అధికారులను వదిలి పెట్టేదే లేదు. వైఎస్ వివేకా హత్య విషయంలో తనపై వైఎస్ కుటుంబం ఒత్తిడి తెచ్చారని పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకు వాంగ్మూలం ఇస్తామన్నారు. ఆ తర్వాత సీఐ శంకరయ్యకు ప్రమోషన్ ఇచ్చారు. ఇదే విషయాన్ని సీబీఐ తన నివేదికల్లో స్పష్టంగా చెప్పింది. ఏ తప్పు లేకున్నా.. 70 ఏళ్ల వయసు.. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఉన్న అయ్యన్నను A-1 అంటారా..? ఇరిగేషన్ అధికారి మల్లిఖార్జునపై ఒత్తిడి తెచ్చి ఫిర్యాదు ఇప్పించారు. మేం ఇలా చేయాలంటే ప్రతిపక్షంపై ఎన్ని కేసులు పెడతారు..? శారీరకంగా హింసిస్తారేమో.. మానసికంగా మేం బలంగా ఉన్నామని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version