బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ వరుస విషాదాలకు కేంద్రంగా మారుతుంది. తాజాగా బీచ్ వద్దకు విహారయాత్రకు వచ్చిన విద్యార్థులలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. విజయవాడకు చెందిన మొత్తం 8విజయవాడకు చెందిన మొత్తం 8 మంది విద్యార్థులు బీచ్ లో స్నానం చేస్తుండగా.. నీళ్లలో మునిగిపోయారు. ఇద్దరిని మత్స్యకారులు కాపాడారు. మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. ఈ ఘటనపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
“బాపట్ల సూర్యలంక బీచ్ లో విహారానికి వెళ్లి విజయవాడ సింగ్ నగర్ కు చెందిన 6గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. మృతులంతా పేద కుటుంబాలకు చెందిన వారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను కోల్పోయిన ఆ యువకుల కుటుంబాలకు జరిగిన నష్టం అపారం. పండుగ వేళ బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. పర్యాటక కేంద్రాల వద్ద ప్రభుత్వం తగు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరుతున్నాను”. అని ట్విట్టర్ వేదికగా కోరారు.
బాపట్ల సూర్యలంక బీచ్ లో విహారానికి వెళ్లి విజయవాడ సింగ్ నగర్ కు చెందిన 6గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. మృతులంతా పేద కుటుంబాలకు చెందిన వారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను కోల్పోయిన ఆ యువకుల కుటుంబాలకు జరిగిన నష్టం అపారం.(1/2) pic.twitter.com/cjWWab3xOf
— N Chandrababu Naidu (@ncbn) October 6, 2022