ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు గుడ్న్యూస్ అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిడ్కో లబ్దిదారులకు తాజాగా చంద్రబాబు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఇళ్ల కేటాయింపు పూర్తై, బ్యాంకు రుణాలు చెల్లించలేక, నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.102 కోట్లను చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి రాష్ట్రంలో 1.18 లక్షల టిడ్కో గృహాలు పూర్తికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.