Allu Arjun controversy CM Revanth Reddy’s key orders: అల్లు అర్జున్ వివాదంపై..తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ సూచనలు చేశారు.
మీడియా సమావేశాలు, చర్చల్లో అల్లు ఎపిసోడ్‌పై మాట్లాడొద్దన్న రేవంత్…పార్టీ నాయకులు కూడా మాట్లాడకుండా చూడాలని పీసీసీకి ఆదేశించారు. ఇక అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు.. రూ.2 కోట్లతో శ్రేతేజ్ ట్రస్ట్‌కు శ్రీకారం చుట్టారట అల్లు అర్జున్. ఇందుకోసం బన్నీ రూ.1 కోటి, సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు ఇవ్వనున్నారు. ఇక ఈ ట్రస్ట్‌లో సభ్యులుగా.. శ్రీతేజ్ తండ్రి, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు ఉంటారని సమాచారం. బాధిత కుటుంబానికి అండగా ఉండటం కోసమే.. ఈ నిర్ణయానికి కారణం అని చెబుతున్నారు. లీగల్ ఇష్యూస్ నుంచి బయటపడగానే.. ఈ ట్రస్ట్ గురించి అల్లు అర్జున్ ప్రకటన చేస్తారని చెబుతున్నారు.