నాకోసం సంఘీభావం తెలిపిన అందరికీ ధన్యవాదములు: చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే నాలుగు వారాల పాటు హై ఇచ్చిన మధ్యంతరం బెయిల్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల అవ్వడం జరిగింది. జైలు నుండి బయటకు వస్తూనే తమ మనవడు దేవాన్ష్ ను కలిసిన చంద్రబాబు, ఆ తరువాత పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలు మరియు అభిమానులకు అభివాదం చేశాడు. కాగా 52 రోజుల తర్వాత చంద్రబాబు తొలిసారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. చంద్రబాబు మాట్లాడుతూ నేను జైల్లో ఉన్న కఠినమైన సమయంలో నాకోసం రోడ్ల మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు చెప్పారు. నేను అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని మీరు ప్రపంచం అంతా కనిపించేలా చేశారు ఇంతకన్నా ఈ జన్మకు నాకేమీ అవసరం లేదంటూ సంతోషంగా మాట్లాడారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల నుండి నాకు సంఘీభావం తెలిపిన వారందరికి ధన్యవాదములు తెలిపారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version