మొనగాళ్లు నా తెలంగాణ రైతులు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజాశక్తి గెలవాలి. ఈ బాధ శాశ్వతంగా పరిస్కరించే బాధ్యత నాది. గోదావరి నీళ్లను ఉదయ సముద్రంకి తీసుకొస్తామని.. అక్కడి నుంచి పెద్దదేవుళపల్లి చెరువులోకి నీళ్లు తీసుకొస్తాం. బీఆర్ఎస్ గెలిస్తే ఇవన్ని సాధ్యం అవుతాయి. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ అని తెలిపారు.
తన కలను నిజం చేసిన మొగోళ్లు, మొనగాళ్లు తెలంగాణ రైతులని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో నేడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తున్నామని తెలిపారు. గతంలో కేవలం 30 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేవన్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల పనులు పూర్తి అయితే పంజాబ్ ను కూడా దాటేస్తామన్నారు. త్వరలోనే 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి చేరి ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలుస్తామని తెలిపారు. పదేళ్ల నుంచి ఒక మత కల్లోలం లేదు. కానీ కాంగ్రెస్ దుర్మార్గులు ఎంపీ కొత్త ప్రభార్ రెడ్డిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు.