ఏపీలో వ్యాక్సిన్‌ల చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీలో ఎందుకు వ్యాక్సిన్లు తక్కువగా వేస్తున్నారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదేపదే ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి అటు వైసీపీ మంత్రులు కూడా గట్టిగానే కౌంటర్ వేస్తున్నారు. మొన్నటి వరకు కొత్తరకం కరోనా వైరస్‌పై రచ్చ జరగ్గా.. ఇప్పుడు వ్యాక్సిన్ చుట్టూ జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వం వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం చేస్తోందని, రోజుకు కనీసం రెండు లక్షల మందికి కూడా వ్యాక్సిన్లు వేయట్లేదని చంద్రబాబు నాయుడు బాంబు పేల్చారు. ఇక మంత్రి కొడాలి నాని కౌంటర్ వేస్తూ.. రోజుకు నాలుగు లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నామని, కేంద్రం వ్యాక్సిన్లు ఇస్తే రోజుకు 10లక్షల మందికైనా వేస్తామని చెప్పారు.
కేంద్రానికి వ్యాక్సిన్లు కావాలని సీఎం జనగ్ ఇప్పటికే రెండు సార్లు లేఖ రాశారని, కానీ కేంద్రం స్పందించట్లేదని తెలిపారు. రాష్ట్రానికి చంద్రబాబు వ్యాక్సిన్లు ఇస్తే.. ఆయనకు కమీషన్ కూడా ఇస్తామని ఎద్దేవా చేశారు. ఇక ఈ మాటలతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఇటు చంద్రబాబు, అటు కొడాలి నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు ఈ మాటలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.