ఏపీలో ఎన్నికలే లక్ష్యంగా ప్రదాన పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రదాన పార్టీల నేతలు ప్రజా మద్ధతు పెంచుకునే పనిలో పడ్డాయి. ప్రజల మద్ధతు పెంచుకుని అధికారంలోకి రావాలని ఇటు జగన్, అటు చంద్రబాబు కష్టపడుతున్నారు. రెండోసారి కూడా అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తుంటే..ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బాబు చూస్తున్నారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో ఇద్దరు నేతలకు చావో రేవో లాంటివే..ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మరొకసారి అధికారంలోకి రాకపోతే కసి మీద ఉన్న టిడిపి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. అలాగే మళ్ళీ టిడిపి అధికారంలోకి రాకపోతే వైసీపీ ఏం చేస్తుందో కూడా ఊహించుకోవచ్చు. కాబట్టి ఇద్దరికీ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం. అందుకే ఇద్దరు నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. ఓ వైపు పథకాలకు బటన్ నోక్కే పేరుతో జగన్ భారీ సభలతో ప్రజలతో ఉంటున్నారు. అలాగే తాను పథకాల ద్వారా డబ్బులు ఇచ్చానని, ఇంతవరక్ అలా ఎవరు ఇవ్వలేదని, కాబట్టి ఆ పథకాలు మళ్ళీ కొనసాగాలంటే తనకు అండగా ఉండాలని జగన్ కోరుతున్నారు.
అసలు జగన్ వచ్చాక అరాచకాలు పెరిగిపోయాయని, పథకాల పేరిట రూపాయి వచ్చి, పన్నుల పేరిట వంద రూపాయిలు దోచేస్తున్నారని, ఇక ప్రతి పథకంలో అవినీతి అని, అలాగే ఎమ్మెల్యేలు భూ దోపిడి, ఇసుక దోపిడి ఇలా అన్నీ దోపిడిలే అని, ఇంకా అభివృద్ధి లేదంటూ బాబు..జనాలకు చెబుతున్నారు.
ఇలా ఎవరి వర్షన్ వారు చెబుతున్నారు. అయితే ఇద్దరు నేతలకు జనం నుంచి మంచి స్పందన వస్తుంది. కానీ అసలైన మద్ధతు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. జనం చాలా తెలివిగా ఉన్నారు..ఎవరి వైపు ఉంటారో ఇప్పుడే బయటపడటం లేదు. చూడాలి మరి చివరికి జనం ఎటువైపుకు వస్తారో.