ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారం తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మూడు ప్రాంతాల నాయకులు కూడా దీనిపై ఇప్పుడు ఏ విధంగా స్పందించాలో అర్ధం కాక ఇబ్బంది పడుతున్నారు. గంటా శ్రీనివాసరావు, కేయీ కృష్ణ మూర్తి లాంటి నేతలు జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు. ఆ తర్వాత కమిటి నివేదిక కూడా అలాగే ఉండటంతో తెలుగుదేశం ఇప్పుడు ఒక రకంగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఏ విధంగా మాట్లాడితే ఏ తలనొప్పి వస్తుందో అనే భావనలో పార్టీ ఉంది.
దాని గురించి ఎం స్పందించాలో అర్ధం కాక చివరికి చంద్రబాబు కూడా ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన అధినేత, దాని గురించి మాట కూడా మాట్లాడలేదు. ఇక నేతలకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారని సమాచారం. రాజధాని గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని, మంత్రులు గా చేసిన వాళ్ళు నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలని, జగన్ గుడ్డ కాల్చి మన నెత్తిన వేసారని, దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే దాని మీద కసరత్తు చెయ్యాలని నేతలకు చంద్రబాబు సూచించారట.
సోషల్ మీడియాలో కూడా రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకించే సమయంలో అర్ధవంతంగా మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచించారట. లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుందని, విమర్శలు ప్రతీ ఒక్కటి జగన్ కు వ్యతిరేకంగా ఉండాలి గాని రాజధానికి కాదని చెప్పారట. కాగా ఈ ప్రకటనతో పార్టీలో చీలిక వచ్చింది అనే ప్రచారం కూడా జరుగుతుంది.