కడప, చిత్తూరు జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన..షెడ్యూల్ ఇదే

-

కడప, చిత్తూరు జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజంపేట మండలం తో గురు పేట గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శిస్తారు చంద్రబాబు నాయుడు. అనంతరం 12 గంటలకు మందపల్లి, పూల పుత్తూరు, అలాగే గుడ్లూరు గ్రామాల్లో వరుసగా పర్యటిస్తారు చంద్రబాబు నాయుడు.

అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రోడ్డు మార్గంలో తిరుపతికి వెళ్లనున్నారు. చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రహదారిలో ముంపునకు గురైన ఆటో నగర్ ప్రాంతాన్ని ఈ సందర్భంగా పరిశీలిస్తారు చంద్రబాబు నాయుడు. అనంతరం లక్ష్మీపురం కూడలి, ఎం ఆర్ పల్లె, శ్రీ కృష్ణా నగర్, గాయత్రి నగర్, సరస్వతి నగర్ అలాగే దుర్గానగర్ ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ముగ్గు బాధితుల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. అనంతరం రేణిగుంట లోని వై కన్వెన్షన్ కేంద్రంలో బస చేయనున్నారు. బుధవారం ఉదయం తిరుచానూరు సమీపంలో కోతకు గురైన స్వర్ణముఖి నది పై నిర్మించిన వంతెనను పరిశీలిస్తారు చంద్రబాబు నాయుడు. అనంతరం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version