చిత్తూరు : మదనపల్లె పర్యటనలో జగన్, కేసీఆర్‌లపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రా సీఎంలు కలసి భోజనం చేసి… ముద్దులు పెట్టుకోవడం కాదని… ఇద్దరు కలసి కర్ణాటక లోని అల్ మట్టి, మహారాష్ట్ర లోని బీమా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని చురకలు అంటించారు. అక్కడ డ్యామ్ లు కడితే కృష్ణా నది ఎడారిగా మారుతుందని… ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం జగన్ కు రాజకీయ బిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలేనని… అలాంటి రాయలసీమకు కృష్ణా జలాల కోసం జగన్… తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాజీపడటం సబబు కాదని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం ఎడమ కాలువపై 810 అడుగులకే జల విద్యుత్ తయారు చేస్తూ, కృష్ణా జలలాను సముద్రంలోకి వదిలేస్తుంటే జగన్ చూస్తూ ఊరుకున్నాడని నిప్పులు చెరిగారు. అపెక్స్ కౌన్సిల్ కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యవహరిస్తున్నా…. ఎమ్మెల్యేలు, ఎంపీలు నిమ్మకు నీరెత్తి సైలెంట్ గా ఉన్నారని ఫైర్ అయ్యారు.