ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. 8, 9 తరగతుల విద్యార్థులకు రోజు మార్చి రోజు క్లాసులు నిర్వహించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే పదవ తరగతి విద్యార్థులకు మాత్రం ప్రతి రోజు క్లాసులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 14 నుంచి ఆరు ఏడు తరగతి విద్యార్థులకు కూడా క్లాసులు ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నిబంధనలు పాటిస్తూనే స్కూల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే, నిజానికి ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభించబోతున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కేవలం 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే 23 నుంచి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 14వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితిని సమీక్షించుకుని 1- 5 తరగతుల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.