42 ఏళ్ల తర్వాత దొరికిన విగ్రహాలు.. ఏకంగా లండన్ లో !

-

నాగపట్నం జిల్లాలోని అనంతమంగళంలో ఉన్న పురాతన రాజగోపాల స్వామి ఆలయంలో 42 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన మూడు విగ్రహాలు తిరిగి ఆలయానికి చేరాయని అధికారులు తెలిపారు. లండన్‌లో స్వాధీనం చేసుకున్న ఈ  విగ్రహాలు చెన్నై నుంచి శనివారం ఆలయానికి చేరుకున్నాయి. 1978లో, 15 వ శతాబ్దపు ఈ ఆలయానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుడి విగ్రహాలు దొంగిలించబడ్డాయి. ఆ రోజుల్లో పోరయార్ పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురిని కూడా అరెస్టు చేశారు, కానీ విగ్రహాలు గుర్తించలేకపోయారు.

అంతర్జాతీయ మార్కెట్లో కళాఖండాల వాణిజ్యాన్ని పర్యవేక్షించే సింగపూర్ ఆధారిత స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన సమాచారం మేరకు దొంగిలించబడిన నాలుగు విగ్రహాలలో మూడు విగ్రహాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌ లోని ఒక పురాతన వస్తువులను సేకరించే వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. లండన్‌లోని మెట్రోపాలిటన్ పోలీసులు మూడు విగ్రహాలను (రామ, లక్ష్మణ, మరియు సీత) భారత రాయబార కార్యాలయానికి అప్పగించారు. ఈ విగ్రహాలను భారత్‌కు తీసుకువచ్చిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version