బూతుల మంత్రి కొడాలి నానిని మాత్రం కొనసాగించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. గతంలో పేర్నినాని ఎన్నో సార్లు జగన్ చెప్పినవన్నీ చేశారు. తన శాఖకు సంబంధించినవి కాకపోయినా కూడా మాట్లాడారు. రవాణా శాఖ మంత్రిగానే ఉంటూ సమాచార శాఖను కూడా చూశారు.
ఆఖరి నిమిషాన సినిమాటోగ్రఫీ శాఖను నిర్వహించి మొన్నటి వేళ భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో వివాదాలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. థియేటర్లకు అధికారులను పంపి మరీ కౌంటర్లలో తాము చెప్పిన విధంగా టికెట్లు అమ్మేలా ఆయన చర్యలు తీసుకున్నారు.ఇవన్నీ చేయించినవి తెర వెనుక ఉన్న వైసీపీ పెద్దలే అయినా ఆయన వీర విధేయుడుగా ఉన్నారు కనుక వివాదాస్పద జీఓ అమలుకు సాయశక్తులా కృషి చేశారు. తరువాత రివైజ్డ్ జీఓ వచ్చింది. అందుకు మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న చొరవ,ఆయన జరిపిన సంప్రతింపులు ఫలించాయి.అప్పుడు కూడా పేర్ని నాని మాట్లాడారు. అదేవిధంగా మాట్లాడ కూడని మాటలు కూడా కొన్ని అంతకుమునుపు మాట్లాడారు. సీఎంతో చిరు జరిపిన లంచ్ మీట్ కు సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, పెదవి విరుపు మాటలు చెప్పారు. ఇన్నీ జరిగిన తరువాత ఇప్పుడాయన పదవి నుంచి తప్పుకోబోతున్నానని స్వయంగానే వెల్లడించి, అందరినీ ఆశ్చర్యపరిచారు.