పీఎం కిసాన్ స్కీమ్ లో మార్పులు.. ఇలా చెయ్యకపోతే డబ్బులు రావు…!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. అయితే రైతుల కోసం కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. పీఎం కిసాన్ యోజన 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం న్యూఇయర్ కానుకగా అందించింది.

త్వరలోనే 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రైతుల కోసం ఇవ్వనుంది. అయితే ఈ డబ్బులు రావాలంటే రెండు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్‌లో రెండు కీలక మార్పులను తెచ్చింది. మొదటిది లబ్దిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీని సమర్పించాలని ప్రభుత్వం అంది.

రెండవది స్టేటస్‌ను చెక్ చేసుకునే విధానం మార్చింది. పీఎం కిసాన్ పోర్టల్‌లో మొబైల్ నెంబర్‌ను నమోదు చేస్తే స్టేటస్ రాదు. ఆధార్ నెంబర్ లేదా బ్యాంకు అకౌంట్ నెంబర్ ద్వారా మాత్రమే స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది.

ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే నెక్స్ట్ ఇంస్టాల్ మెంట్ డబ్బులు అందుతాయి. లేదంటే డబ్బులు రావు. https://pmkisan.gov.in/NewHome3.aspx వెళ్లి కుడి వైపున చాలా ట్యాబ్‌లు ఉంటాయి. అక్కడ ఈ-కేవైసీ న్యూ అని ఉంటాది. దానిపై క్లిక్ చేయాలి. అన్నీ ఫిల్ చేసాక ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version