ఏప్రిల్ 1 నుంచి ఈ పోస్టాఫీసు పథకాలలో మార్పులు..!

-

చాలా మంది భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కూడా రాకూడదని స్కీముల్లో వాటిల్లో డబ్బులని పెడుతూ వుంటారు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లోను ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడితే అదిరే లాభాలని పొందేందుకు అవుతుంది. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ పోస్టాఫీసు పథకాలలో మార్పులు రానున్నాయి. వాటి కోసం చూద్దాం. ఇక ఇప్పుడు మార్చి నెల ముగియబోతోంది. ఏప్రిల్‌ నెల రానుంది. వచ్చే నెల ఫైనాన్షియల్‌ సెక్టర్‌ తో పాటు వివిధ ప్రభుత్వ పథకాలలో మార్పులు రానున్నాయి.

యూనియన్ బడ్జెట్ 2023 అత్యంత ప్రజాదరణ పొందిన రెండు పోస్టాఫీసు పథకాలలో కేంద్రం మార్పులు చేయడం జరిగింది. పైగా కొత్త స్కీమ్ ని కూడా తీసుకు వచ్చింది. ఇక ఎలాంటి మార్పులు చేసింది అనేది చూస్తే.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు కొన్ని మార్పులు తెలుసుకోవాలి. 2023 బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 2004లో వృద్ధులకు రిటైర్ అయ్యాక సురక్షితమైన ఆదాయం అందించాలనే లక్ష్యం తో ఏర్పాలు చేసింది. జనవరి-మార్చి త్రైమాసికానికి సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై వడ్డీ రేటు ఎనిమిది శాతంగా వుంది. కనిష్ట డిపాజిట్ రూ. 1000. మల్టిపుల్ 1000తో 5 సంవత్సరాలకు నిర్ణయించబడుతుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లిమిట్ ని రూ.4 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు.

జాయింట్ హోల్డింగ్ కి అయితే లిమిట్ ని రూ.9 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచారు. మంత్రీ ఇన్కమ్‌ స్కీమ్‌ ఖాతా ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌ను పురస్కరించుకొని ఈ స్కీమ్ ని మహిళల కోసం తీసుకొచ్చారు. గరిష్టంగా 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version