మరికాసేపట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం బిజెపికి 119 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 75 ఎమ్మెల్యేలు, జేడీఎస్ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటకలో 36 ఎస్సి,15 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. మే 24 తో అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. కర్ణాటకలో 5.21 కోట్ల ఓటర్లు ఉన్నారు.
150 స్థానాల గెలుపు లక్ష్యంగా పెట్టుకుంది బిజెపి. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఒక్క లింగ,లింగాయత్ వర్గాలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది బిజెపి. ఇప్పటికే 124 స్థానాలకు అభ్యర్థులు కాంగ్రెస్ ప్రకటించగా, 93 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జేడీఎస్. ఏప్రిల్ మొదటివారంలో అభ్యర్థులను ప్రకటించనుంది బిజెపి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు వయనాడ్, జలందర్ లోక్ సభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. సంతోక్ సింగ్ చౌదరి తో జలందర్ లో ఉప ఎన్నిక, రాహుల్ గాంధీ పై అనర్హత వేటుతో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక జరుగే ఛాన్స్ ఉంది. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.