ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో చేసిన మార్పులు ఇవే…!

-

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది చదువుల్లో కూడా పలు మార్పులు వచ్చాయి. అయితే ఇంటర్మీడియట్ సిలబస్‌ను 70 శాతానికే పరిమితం చేసిన సంగతి కూడా తెలిసినదే. ఈ కారణంగా
ఇంటర్ పరీక్షల ప్రశ్నా పత్రాల్లో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. విద్యార్థులు ఈ మార్పులని గమనించండి. ఇలా మార్పులు ఉండడం తో ఇంటర్ మోడల్ పేపర్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.

అలానే అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు విడుదల చేసిన సెంపిల్ పేపర్స్ ప్రకారం రెండు మార్కుల ప్రశ్నలు పదింటికి పది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నల్లో మార్పులు చేశారు. మీకు కనుక మోడల్ పేపర్స్ కావాలంటే tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ లో చూడొచ్చు. కాగా ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడం తెలిసినదే.

మే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ కి పరీక్షలు జరగనున్నాయి. అలానే ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్నల్‌ పరీక్షలయిన ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను ఏప్రిల్‌ 1న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను ఏప్రిల్‌ 3న జరగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version