కేటీఆర్ క్లాస్ తో ఆ ఇద్దరు నేతలు కలిసినట్టేనా

-

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు మొన్నటి వరకు సై అంటే సై అన్నారు ఆ ఇద్దరు నేతలు. మాటలు కరువైన నేతలిద్దరు కెటీఆర్‌ కి తామే రెండు కళ్లమని చెప్పుకుంటున్నారు. ఒకే వేదికను పంచుకుంటున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న ఈ ఇద్దరి నేతల వైరం కేటీఆర్ క్లాస్ తో కొలిక్కి వచ్చిందా లేక రాజకీయాల్లో స్నేహాలు, శతృత్వాలు శాశ్వతం కాదనుకున్నారా ఖమ్మంలో మంత్రి అజయ్ మాజీ ఎంపీ పొంగులేటి పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.

పొంగులేటి,పువ్వాడ అజయ్ ల రాజకీయ ప్రయాణం ఒకే చోట ప్రారంభమైంది. కలిసి పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టిన ఇద్దరు నేతలు తెలంగాణ విభజనకు ముందు ఒకే వేదికలో, ఒకే రాజకీయ పార్టీలో తమ ప్రయాణాన్ని ప్రారంబించారు. ఇద్దరూ వైసిపి నుంచి పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన, పువ్వాడ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి, టీఆర్ఎస్ గూటికి చేరారు. పొంగులేటి వైసీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. పువ్వాడ మంత్రి పదవిలో ఉంటే, పొంగులేటి మాత్రం ప్రస్తుతం ఏ పదవి లేకుండా ఉన్నారు.

కొంత కాలం ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నా ఇప్పుడు మాత్రం..ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు. రానున్న ఎంఎల్ సి ఎన్నికలలో గులాబీ అభ్యర్ధిని గెలిపిస్తామంటున్నారు. ఇంకా ముందుకు వెళ్లి మేమిద్దరం యువ నేత కెటిఆర్ కు రెండు కళ్లలాంటి వాళ్లమని వేదికలెక్కి చెబుతున్నారు. రాజకీయాల్లో స్నేహాలు, శతృత్వాలు శాశ్వతం కాదు.. ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో ఈ అంశం స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన రాజకీయ వ్యవహారాలు ఇద్దరిని కలిపాయని టాక్ నడుస్తోంది.

కేటీఆర్ సమన్వయ సమావేశం తరువాత నేతల విభేదాలు పక్కన పెట్టి కలిసిపోయారనే టాక్ నడుస్తోంది. వైరా ఎంఎల్ ఎ రాముల్ నాయక్, మాజీ ఎంఎల్ఎ మదన్ లాల్… అటు సత్తుపల్లిలో ఎంఎల్ఎ సండ్ర వెంకటవీరయ్య , మట్టా దయానంద్ తో కలసి రాజకీయ విందులో కూడ పాల్గొనడం మారుతున్న రాజకీయాలను సూచిస్తోంది. ఎంఎల్ సి పల్లా ను గెలిపించేందుకు మంత్రి పువ్వాడ, మాజి ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కలిసి ప్రచారం చేస్తున్నారు. ఎంఎల్ సి ఎన్నికలు వారిద్దరిని దగ్గర చేశాయా.. లేక కేటీఆర్ మాట మీద ఇద్దరు ఒక్కటయ్యారా అని గులాబీ పార్టీ కేడర్ గుసగుసలాడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version