ఈ 6 మంత్రాలను రోజూ ప‌ఠించండి.. ధ‌నం, ఆరోగ్యం, జ్ఞానం పొందండి..!

-

హిందువులు ఎవ‌రైనా స‌రే.. త‌మ ఇష్ట‌దైవాన్ని ప్రార్థించేట‌ప్పుడు ఆ దైవానికి చెందిన మంత్రాల‌ను చ‌దువుతారు. అలాగే.. ఆ దైవానికి ఇష్ట‌మైన ప‌దార్థాల‌ను నైవేద్యంగా పెడుతుంటారు. ఈ క్ర‌మంలోనే దేవుళ్లు, దేవ‌త‌లను బ‌ట్టి భిన్న ర‌కాలైన మంత్రాలు ఉంటాయి. వాటిని చ‌దువుతూ దైవాన్ని ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెర‌వేరుతాయ‌ని భక్తులు విశ్వ‌సిస్తారు. అయితే కింద ఇచ్చిన మంత్రాల‌ను కూడా భ‌క్తులు చ‌దివితే దాంతో వారికి ఆయుష్షు, ధ‌నం, శ‌క్తి సిద్దిస్తాయి. మ‌రి ఆ మంత్రాలు ఏమిటంటే…

1. గాయత్రి మంత్రం – ఈ మంత్రాన్ని చ‌దివితే చ‌దువు బాగా వ‌స్తుంది. మానసిక శ‌క్తి పొందుతారు. విద్య‌లో నిపుణులు అవుతారు.

ఓం భూర్భువస్సువః ! తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి! ధియోయోనః ప్రచోదయాత్ !!

2. మహామృత్యుంజయ మంత్రం – ఈ మంత్రం చ‌దివితే ఎవ‌రికైనా మ‌ర‌ణం అంత త్వర‌గా రాదు. ఆయుష్షు పెరుగుతుంది.

ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్ధనమ్!
ఉర్వారుక మివ బంధనాన్మృత్యోరుక్షీయ మామృతాత్!!



3. శ్రీ గణేష మంత్రం – వినాయ‌కుడికి చెందిన ఈ మంత్రాన్ని ప‌ఠిస్తూ ఆయ‌న్ను పూజిస్తే మీరు త‌ల‌పెట్టే ప‌నులు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొన‌సాగుతాయి.

శ్రీ వక్రతుండాయ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం
కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

4. సరస్వతి స్తోత్రం – విద్యార్థులు చ‌దువుల్లో రాణించాలంటే ఈ మంత్రాన్ని రోజూ చ‌ద‌వాలి.

యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్ర్తాన్వితా
యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా
యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా
సామాం పాతు సరస్వతి భగవతి నిఃశేషజాడ్యాపహా!!

5. లక్ష్మీ స్తోత్రం – ల‌క్ష్మీదేవికి సంబంధించిన ఈ మంత్రాన్ని రోజూ చ‌దివితే ధ‌నం, ఆయురారోగ్యాలు ల‌భిస్తాయి.

అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్,
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః

6. లక్ష్మీ స్తుతి – ఇది కూడా ల‌క్ష్మీదేవి మంత్ర‌మే. దీన్ని ప‌ఠించినా పైన చెప్పిన ఫ‌లితాలే క‌లుగుతాయి.

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే

Read more RELATED
Recommended to you

Exit mobile version