గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అబిడ్స్ స్టాన్లీ కాలేజీలో గందరగోళం నెలకొంది. ఆదివారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన హైకోర్టు పరీక్ష ఆలస్యం జరిగింది. రాష్ట వ్యాప్తంగా వందలాది మంది పరీక్ష రాసేందుకు సెంటర్ వద్దకు చేరుకున్నా కంప్యూటర్‌లు మొరాయించినట్లు సమాచరాం.
దీంతో పరీక్ష ఇంకా మొదలు కాలేదని సమాచారం.దీంతో పాటు సెంటర్ వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో జిల్లాల నుంచి వచ్చిన వికలాంగ, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అధికారులు హైకోర్టు పరీక్షలు సత్వరమే నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. సెంటర్ వద్ద ఏర్పాట్ల తీర్పుపై అభ్యర్థులు మండిపడుతున్నారు