వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో సూర్యాపేట రైతులు బయల్దేరనున్నారు. BRS రజతోత్సవ సభకు మేము సైతం అని రైతులు అంటున్నారు.ఇప్పటికే సూర్యాపేట నుండి తరలివెళ్లేందుకు ఎడ్లబండ్లు ముస్తాబవుతున్నాయి. కేసీఆర్ మాటలు వినాలని.. కొండంత అభిమానంతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారధ్యంలో స్వచ్చందంగా వెళతామంటున్న రైతులు చెబుతున్నారు.
కేసీఆర్ సారును కలవాలి.. మా గోడు వెళ్ళబుచ్చుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. గత పదేండ్లు BRS పాలనలో ఆనందంగా వున్నామని, అన్నిరంగాలతో పాటు రైతంగాన్ని కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నాడని వారు చెబుతున్నారు. జగదీష్ రెడ్డి కాళేశ్వరం నీళ్లతో ఎండిన చెరువులు నింపి సూర్యాపేటను సస్యశ్యామలం చేశాడని.. మండువేసవిలో ఎండిన చెరువులు అలుగులు పోసినయని గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు పంటలు బాగా పండాయని.. అప్పులు తీర్చుకున్నామని..నాలుగు పైసలు చేతుల పట్టుకున్నామని చెబుతున్నారు.
ఇప్పుడు నీళ్లులేక పంటలు సరిగా పండక మళ్ళీ రైతులు కూలి పనుల కోసం వలసపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.అందుకే మాకు మళ్ల కేసీఆర్ పాలనే కావాలె.. అంటూ సూర్యాపేట రైతులు ధీమాగా చెబుతున్నారు.బండెనక బండి కట్టి అన్న పాటను తలపించేలా సూర్యాపేట రైతులు ఎడ్ల బండ్లను ముస్తబుచేస్తున్నారని, ఈనెల 22న సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ (ఎస్) మండలంలోని నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి మొక్కి బయలుదేరుతామని రైతులు చెబుతున్నారు.