జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం కుదురుపల్లి గ్రామానికి చెందిన యువకులు వాకింగ్‌కు వెళ్లగా వాగులో క్షుద్ర పూజలు చూసి భయాందోళనలకు గురయ్యారు. మేకపోతును బలిచ్చి, కొబ్బరికాయలు, అన్నం బట్టలను వదిలేసారు. క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను చూసి జనం సైతం ఆందోళన చెందుతున్నారు.
తమ గ్రామంలో ఇటువంటి పూజలు నిర్వహించిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి భయానక పూజలు మరోసారి నిర్వహించకుండా చూడాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉండగా, అర్ధరాత్రి పూజలు నిర్వహించడంతో ఎవరికి ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయపడుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
వాగులో క్షుద్ర పూజల కలకలం..
(Sensitive Content )జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఆదివారం ఉదయం కుదురుపల్లి గ్రామానికి చెందిన యువకులు వాకింగ్ కు వెళ్లగా వాగులో క్షుద్ర పూజలు చూసి భయాందోళనలకు గురయ్యారు. మేకపోతును బలిచ్చి,… pic.twitter.com/5L1w85TAvL
— ChotaNews (@ChotaNewsTelugu) December 1, 2024