ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం RC15. కార్తీక్ సుబ్బరాజ్ ఈ ఫిల్మ్ కు స్టోరి అందించగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్.
రామ్ చరణ్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నారని కొద్ది రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్ గా , టెంపర్ ఉన్న యువకుడిగా మూడు పాత్రల్లో రామ్ చరణ్ పాత్రను చాలా చక్కగా డిజైన్ చేశారట. వ్యవస్థను ప్రశ్నించే నేపథ్యంలో స్టోరి, క్యారెక్టరైజేషన్స్ లో శంకర్ మార్క్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు.
కమల్ హాసన్ ‘భారతీయుడు’ సినిమా మాదిరిగానే ఈ సినిమాలో సొసైటీకి చక్కటి సందేశాన్ని శంకర్ అందించబోతున్నారని తెలుస్తోంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి రామ్ చరణ్ లుక్ లీక్ అయింది.ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి.
🎉😍🤩🥰💥🌋
Hottest man in the world #RamCharan will be at it's peak in #RC15 🔥.
Thanku #Shankar mama.#ManofMassesRamCharan pic.twitter.com/zOgI1W1lhA— VCV (@Vishal_c_Victor) July 2, 2022