బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై ఛార్జ్ షీట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ…దొరను ఓడించాలని రాజేందర్ ను గెలిపిస్తే.. ప్రజలకు ఒరిగిందేంటి? అని ఆగ్రహించారు. బీఆరెస్ అక్రమాలపై ఇప్పటి వరకు ఇక్కడి ఎమ్మెల్యే పోరాడటం లేదు…ఈటెల తన అక్రమాల్లో వాటా ఇచినందుకే బీఆరెస్ లో ఆయన్ను అందలం ఎక్కించారన్నారు.
ఈటెల ఏనాడు రోడ్డెక్కి పోరాడింది లేదు…ఈటెల పౌరసరఫరాల మంత్రిగా ఉండగా బియ్యం స్కాంలో డబ్బులు దండుకున్నారని ఫైర్ అయ్యారు. చీకటి ఒప్పందాలు, చీకటి వ్యాపారాలు బయటపడతాయనే ఈటెల బీజేపీలో చేరారు…రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కాంలే కానీ.. ప్రభుత్వ స్కీములు ప్రజలకు చేరడంలేదన్నారు. బీఆరెస్ దొంగ కౌశిక్ కు ఎమ్మెల్సీ ఇచ్చింది…బీఆరెస్, బీజేపీ లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.