డిస్పోజబుల్ పేపర్‌ కప్పుల వల్ల వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఉందట

-

ప్లాస్టిక్‌ వాడకం మానేయమని ప్రభుత్వాలు మొత్తుకోవడంతో.. బయట పేపర్‌ కప్స్‌ వినియోగం ఎక్కువైంది.. ఛాయ్‌, కాఫీ, శీతలపానియాలు లాంటివి పేపర్‌ కప్స్‌లోనే ఇస్తుంటారు. మనం కూడా..ప్లాస్టిక్‌ కాదుగా మంచిదే కదా అని తాగుతుంటాం.. డిస్పోజబుల్ పేపర్ కప్పులు ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదట.. దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎలానో చూద్దామా..!

 

డిస్పోజబుల్ పేపర్ కప్పుల లోపలి భాగంలో కూడా ప్లాస్టిక్ పూత పూస్తారు. వేడి పదార్థాలు అందులో పోయడం వల్ల ఆ ప్లాస్టిక్ కరిగి ద్రవాలలోకి చేరిపోతుంది. ప్లాస్టిక్ పూతతో కూడిన డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో ఇతర హానికరమైన పదార్థాలతో పాటు వేలాది చిన్న ప్లాస్టిక్ కణాలు ద్రవంలోకి విడుదల అవుతాయి. ఒక వ్యక్తి పేపర్ కప్పులో మూడు కప్పుల టీ లేదా కాఫీ తాగితే 75,000 మైక్రోప్లాస్టిక్ కణాలను తీసుకుంటున్నట్టే. ప్లాస్టిక్ వాడకం ఎంత హానికరమో అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వస్తువులు లేదా మరొకటి తరచుగా ఉపయోగించడం వల్ల మన శరీరంలోకి మైక్రోప్లాస్టిక్‌లు ప్రవేశిస్తున్నాయి. చాలా దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నాయి. టీ, కాఫీ, వేడి వేడి సూప్ వంటి పానీయాల పేపర్‌ కప్పుల్లో తాగడం ఏమాత్రం మంచిది కాదట..

పేపర్ కప్పు వల్ల ప్రమాదాలు..

పేపర్ కప్పుల్లో కూడా కొద్ది మొత్తంలో ప్లాస్టిక్ ఉంటుంది. అందులో వేడి టీ లేదా కాఫీ తాగడం వల్ల వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది.
గట్ సమస్యలు వస్తాయి.
ప్లాస్టిక్ పూతతో చేసిన్ పేపర్ కప్స్‌లో వేడి పదార్థాలు పోయడం వల్ల అందులోని హానికర రసాయనాలు డ్రింక్‌ లోకి చేరిపోతాయి.

అధ్యయనంలో తేలిన నిజం..

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.. 15 నిమిషాల పాటు వేడి ద్రవాలు ప్లాస్టిక్ పూతతో ఉన్న డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో పోయడం వల్ల అందులోని 25,000 చిన్న ప్లాస్టిక్ కణాలు, హానికరమైన ఆయాన్లు, భారీ లోహాలు ద్రవంలోకి విడుదల అవుతాయని కనుగొన్నారు. ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్ సల్ఫేట్ వంటి అయాన్లు, విషపూరిత భారీ లోహాలు అందులో ఉన్నాయి. ఇక కాఫీ లేదా టీ లో ఉండే నీటి నమూనాల్లో సీసం, క్రోమియం, కాడ్మియం, ఆర్సెనిక్ ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

అంటే రోజూ తీసుకునే మూడు కప్పుల టీ లేదా కాఫీ తాగే సగటు వ్యక్తి 75,000 మైక్రోప్లాస్టిక్ కణాలను తీసుకుంటున్నాడు. రోజువారీ కాఫీతో పాటు మైక్రోప్లాస్టిక్, భారీ లోహాలు తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు, గట్ సమస్యలు, క్యాన్సర్, నరాల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

శీతల పానీయాలు తాగొచ్చు..

అయితే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన శీతల పానీయాలు పేపర్ కప్పుల్లో తాగితే సురక్షితమేననట.. వీటిలో ఎటువంటి ప్లాస్టిక్ రేణువులు లేవని అధ్యయనం కనుగొంది. పేపర్ కప్స్‌కి బదులుగా సిలికాన్ లేదా గ్లాస్ కప్పుల్లో తీసుకోవడం మంచిది. ఇది మీ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు తీసుకురాదని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version