అలాంటి ఆలోచనలు వున్నవాళ్లను వదిలేయాలి: ఛార్మీ

-

హీరోయిన్ ఛార్మి తోడు కావాలి ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది తర్వాత చాలా సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. జ్యోతి లక్ష్మి సినిమా తర్వాత పూర్తిగా నటనకి దూరం అయిపోయింది. తర్వాత ఏ సినిమాలో కూడా కనపడలేదు. గత కొద్ది కాలంగా సినిమాలకి దూరమై నిర్మాత గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ టు సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో రిలేషన్ షిప్ లో ఉందని గత కొంతకాలంగా పుకార్లు వస్తున్నాయి ఈ వార్తపై వీరిద్దరూ కూడా స్పందించలేదు. తాజాగా ఛార్మి తన ఇన్స్టాల్ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. నెగటివ్ ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తిని వదిలేయాలి అలాంటి మైండ్ సెట్ తో ఉన్నవాళ్లు అవే ఆలోచనలతో ఉంటారు కానీ నాకు మాత్రం ఫోకస్ పెట్టడానికి చాలా పనులు ఉన్నాయని ఛార్మి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఛార్మి పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమెకి ఏదో అయింది అని ఇన్ డైరెక్ట్ గా ఈ పోస్ట్ ద్వారా చెప్పిందని సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version