మండుటెండల్లో మత్తడి దూకుతున్న చెక్ డ్యాములు : మాజీ మంత్రి హరీశ్ రావు

-

మండు టెండల్లో చెక్ డ్యాములు మత్తడి దూకుతున్నాయని.. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మండల పరిధిలోని గోనెపల్లి, ఇబ్రహీం నగర్, రామన్నపల్లి, రాముని పట్ల గ్రామాల్లో పంట నష్ట పోయిన పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోనెపల్లి బ్రిడ్జిపై నుంచి వెళ్తూ అక్కడ కాసేపు ఆగారు. పారుతున్న చెక్ డ్యామ్‌ను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఎవరు ఏమనుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు జీవనాధారగా మారిందని కొనియాడారు. మాజీ మంత్రి వెంట మాజీ ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మేడికాయల వెంకటేశం, జేరిపోతుల శ్రీనివాస్‌లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news