రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతికి చెక్ ఇక లంచం లేకుండా పనులు

-

రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వీలైనంత త్వరగా వీడియో చిత్రీకరణ ప్రక్రియను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో చిత్రీకరణ, నిఘా ఉంచాలని సర్కార్ నిర్ణయించింది. పైలట్​ ప్రాజెక్టుగా 20 రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ కార్యాకలాపాలను వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 20 కార్యాలయాలను ప్రభుత్వం గుర్తించింది.

registration office

ఆదాయం ఎక్కువుగా ఉండి.. రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే కార్యాలయాలను గుర్తించారు. విజయనగరం, విశాఖ, మధురవాడ, ఆనందపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, పటమట, గుణదల కార్యాలయాల్లో వీడియో చిత్రీకరణ చేయనున్నారు. వీటితో పాటు గుంటూరు, మంగళగిరి, కొరిటెపాడు, నరసరావుపేట, ఒంగోలు, తిరుపతి, రేణిగుంట, కడప, కర్నూలు కార్యాలయాల్లో వీడియో చిత్రీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version