మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి.. పరిమితి దాటితే రీవెరిఫికేషన్ తప్పనిసరి

-

ఇప్పుడుఒక్కో పోన్ కి డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంటుంది. మనం ఫోన్ మార్చినప్పుడల్లా కొత్త కొత్త సిమ్ తీసుకున్నా..పర్మినెంట్ నంబర్ ఒకటి మెయిన్టేన్ చేస్తాం. మన అవసరాలకు తగ్గట్టుగా..నంబర్లు తీసుకుంటూ ఉంటాం. అలా కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ నంబర్ పక్కన పడేస్తారు. చాలామంది బ్రేకప్ అయిన తర్వాత..వాళ్ల ఫోన్ నంబర్ మార్చేస్తారు. కొత్తగా జీవితాన్ని స్టాట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు.

ఇలా ఒక్కక్కరి పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయి. అసలు తమ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నామో కూడా కొందరికి గుర్తుండదు. అయితే తాజాగా సిమ్ కార్డులపై పరిమితి విధించింది టెలీకమ్యూనికేషన్ శాఖ. ఒక వినియోగదారుడి పేరు మీద 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులుంటే మళ్లీ వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదేశించింది. అలా చేసుకోని వారి అదనపు కనెక్షన్లు డీ యాక్టివేట్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు డాట్ సూచించింది.

ఒకవేళ తొమ్మిదికి మంచి సిమ్ కనెక్షన్లు ఉండాలనుకుంటే వినియోగదారుడు తప్పకుండా రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వేటిని యాక్టివ్ గా ఉంచుకోవాలి, వేటిని తీసేసుకోవాలన్నది వినియోగదారుడి ఇష్టం. అలాగే.. అసోం, జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు సిమ్ కార్డుల పరిమితిని ఆరుగా నిర్ణయించింది.

ఒకవేళ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కనెక్షన్లు ఉండి రీ వెఫికేషన్ కాకపోతే ఆ మొబైల్‌ కనెక్షన్ ను టెలికాం ఆపరేటర్లు తొలగించేస్తారు. ఎక్కువ కాలం వినియోగంలో ఉండని నంబర్లకు సేవలు ఆపేస్తారు. ఇలా తొమ్మిది కంటే అదనంగా ఉండి ఎక్కువ కాలం వినియోగంలో లేని నంబర్లకు 30 రోజుల్లో అవుట్ గోయింగ్ కాల్స్, 45 రోజుల్లో ఇన్ కమింగ్స్ కాల్స్ సేవలు నిలిపేస్తారు..రీ వెరిఫికేషన్ చేయించుకోకపోతే డిసెంబర్ 7 నుంచి 60 రోజుల తర్వాత డీయాక్టివేట్ అయిపోతాయి. అన్ వాంటెడ్ కాల్స్, నేరపూరిత కార్యాలపాలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాట్ తెలిపింది. అందుకే 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉన్న వారు అదనపు నంబర్లు కూడా కావాలనుకుంటే మళ్లీ ధ్రువీకరణ చేసుకోవటం తప్పనిసరి.

మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా చెక్ చేసుకోండి..

ముందుగా ఇంటర్నెట్ బ్రౌజర్‌లో https://tafcop.dgtelecom.gov.in/ లింక్ ఓపెన్ చేయండి..

ఆ తర్వాత అక్కడ మీ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మొబైల్‌కు ఓటీపీ వచ్చాక దాన్ని ఎంటర్ చేయండి.

ఓటీపీ నమోదు చేశాక.. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది.

మొబైల్‌ నంబర్‌ కింద ఆప్షన్లు కనిపిస్తాయి.

ఒకవేళ ఆ నంబర్‌ మీది కాకపోయినా.. ఆ నంబర్‌ ఇక మీకు అవసరం లేకపోయినా అక్కడ ఉన్న ఆప్షన్లను ఎంచుకొని ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఇలా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. 9 కంటే ఎక్కువగా ఉంటే అదనంగా ఉన్న వాటికి రీవెఫికేషన్ చేయించుకుంటేనే యాక్టివేషన్ లో ఉంటాయి.

ఇంకేందుకు లేట్ మీరు ఓ సారి చెక్ చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version