స్ఫూర్తి: పుట్టగొడుగులు మొదలైన వాటితో 50 లక్షలు… ఈ అబ్బాయి స్టోరీ చూస్తే మీరే మెచ్చుకుంటారు..!

-

ఈ మధ్యకాలంలో ఉద్యోగం చేస్తేనే సక్సెస్ అవ్వొచ్చు అన్నది ఏమీ లేదు. చాలా మంది వ్యాపారం వ్యవసాయం వంటివి చేసి కూడా ఆ సక్సెస్ అవుతున్నారు. పైగా చిన్న వయసు వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి వ్యవసాయ బాట పడుతున్నారు. 18 ఏళ్ళ వికాస్ వర్మ కూడా ఇదే బాట పట్టాడు. ఇక ఇతని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

 

హర్యానాలోని హిసార్ కు చెందిన వికాస్ వర్మ మొదట పుట్టగొడుగుల పెంపకం లో ప్రయోగం చేశాడు. కానీ తీవ్ర నష్టం వచ్చింది అయినప్పటికీ పట్టిన పట్టు విడవలేదు చివరికి అదే బిజినెస్ లో సక్సెస్ సాధించాడు. ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకం తో 50 లక్షల వ్యాపారం చేస్తున్నాడు వికాస్ వర్మ. పైగా చాలా మందికి పుట్టగొడుగుల పెంపకం లో శిక్షణను కూడా ఇస్తున్నాడు.

ఒక రైతు కుటుంబంలో జన్మించిన వికాస్ పూర్వీకులు పండించిన పంటని గమనించాడు. పన్నెండో తరగతి ఉత్తీర్ణత సాధించాక చదువు మీద ఆసక్తి లేదని వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. చాలా మంది రైతులు పుట్టగొడుగులను పండిస్తున్నారు అని.. తను కూడా పుట్టగొడుగులు పండించి మంచిగా లాభాల్ని పొందాలని అనుకున్నాడు అయితే మొదట్లో చాలా కష్టం వచ్చింది.

పండించడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. అయినప్పటికీ అదే బాటలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. తన కంపోస్ట్ పుట్టగొడుగుల పెంపకంకు సరైనది కాదని తెలుసుకుని కొన్ని వారాల తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. ఇంకేముంది సక్సెస్ అయ్యిపోయాడు. కిలో పుట్టగొడుగులు ధర వంద రూపాయలకి అమ్మడం మొదలు పెట్టాడు. అయితే పుట్టగొడుగులు ని కిలో వంద రూపాయలకి అమ్మడమే కాకుండా కిలో పుట్టగొడుగులు కి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా వెయ్యి రూపాయల సంపాదిస్తున్నాడు.

ఇలా చేస్తే సంవత్సరానికి 35 లక్షలు లాభం వస్తుంది. అలానే వికాస్ గత ఆరు సంవత్సరాలుగా 12 వేల మంది రైతులకు శిక్షణ ఇచ్చాడు దీంతో చాలా మంది రైతులు వికాస్ లాగే పండించడం మొదలుపెట్టారు. ఇలా అద్భుతమైన రాబడిని పొందుతూ మంచిగా సక్సెస్ అయ్యాడు వికాస్. అలానే బిస్కెట్లు, పాపడ్స్, పచ్చళ్ళు వంటివి పుట్టగొడుగులుతో తయారు చేసి లక్షలు సంపాదిస్తున్నాడు వికాస్. నిజానికి కష్టపడితే ఫలితం దక్కుతుందని ప్రతి ఒక్కరూ కష్టపడితే అనుకున్నది సాధించ వచ్చు అంతే కానీ ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిందని భయపడి ఆగిపోతే అక్కడితోనే ఆగిపోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version