మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి. రేషన్ కార్డు ఉంటే ఎన్నో లాభాలని పొందొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు తీసుకోవాలంటే రేషన్ కార్డు తప్పక ఉండాలి. ఈ కార్డు ఉండడం వలన పౌరుని రుజువుతో పాటు, అడ్రస్ ప్రూఫ్‌గా కూడా పని చేస్తుంది. ఇక రేషన్ కార్డులో మీ పేరు ఉందో లేదో సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. మరి ఇక పూర్తి వివరాలలోకి వెళితే…
మీరు మీ పేరు ఉందొ లేదో చూడాలంటె ముందు అధికారిక వెబ్‌సైట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్‌కి వెళ్లాలి. nfsa.gov.in లింక్‌పై క్లిక్ చేస్తే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
నెక్స్ట్ మీరు టాప్ మెనూలో రేషన్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరవాత స్టేట్ పోర్టల్‌లో రేషన్ కార్డ్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ అన్ని రాష్ట్రాల పేరులు ఉంటాయి. మీరు మీ రాష్ట్రంని సెలెక్ట్ చేసుకోండి.
రాష్ట్రం పేరును ఎంచుకున్న తర్వాత.. మీ యొక్క జిల్లా పేరును ఎంచుకోవాలి.
మీ పేరును తనిఖీ చేయడానికి మీరు పూర్తి వివరాలను ఫిల్ చెయ్యాలి.
అదే లింక్‌లో రాష్ట్రం, జిల్లా పేరును ఎంచుకున్న తర్వాత.. అర్బన్ లేదా రూరల్ బ్లాక్ పేరు కనిపిస్తుంది. వాటిని ఎంచుకోండి.
మీ గ్రామ పంచాయతీ పేరును ఎంచుకోవాలి.
ఇప్పుడు అనేక రకాల కార్డ్ ఎంపికలు మీ ముందు ఉంటాయి.
మీ రేషన్ కార్డ్ రకంపై క్లిక్ చేస్తే… రేషన్ కార్డ్ హోల్డర్ల పూర్తి జాబితా కనపడుతుంది.
దీనిలో మీరు మీ పేరు లేదా కుటుంబ సభ్యుల పేరును చూసుకొచ్చు.