పెళ్ళింట్లో చుట్టాలు..! వంటింట్లో కరోనా..! క్వారంటైన్ సెంటర్ హౌజ్ ఫుల్..!

-

chef who prepared food for marriage tested corona positive
chef who prepared food for marriage tested corona positive

కరోనా ప్రజలను పిడిగుద్దులు గుద్దుతుంది..! అయినా కొన్ని కార్యాలు చేయక తప్పట్లేదు ప్రజలకి. లక్ డౌన్ అయినా షట్ డౌన్ అయినా ముహూర్తాలు పెట్టేస్తున్నారు పెళ్లిళ్లు జరిపేస్తున్నారు. ఎందుకంటే మరికొన్ని రోజులు ఆగితే ముడాలు ఇక అప్పుడు పెళ్లిళ్లకు ఛాన్స్ ఉండదు. ఈక్రమంలో ఓ ఇంట్లో శుభమా అంటూ పెళ్లిజేశారు.. ఇంతలోనే కొంపముంచే వార్త విన్నారు…!

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూమకూరులో కొద్ది రోజుల క్రితం ఓ కుటుంబం పెళ్లి కుమారుడి ఇంటి వద్దనే నిరాడంబరంగా వివాహం జరిపించారు. పెళ్లికి చుట్టాలను పిలిచారు వంట మనిషిని పిలిచి వంటలతో గుమగుమలాడించారు. వంట చేయడానికి వచ్చిన వంట మాస్టర్‌ (55)కు ఈనెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరా తీయగా పెళ్లి ఇంట్లో వంట చేసిన విషయం బయటపడింది. దీంతో వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి శుభ్రపరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version