నిజామాబాదు జిల్లా బోధన్ మున్సిపల్ పరిధిలోని చెక్కి క్యాంపులో కరోనా కలకలం రేగింది. ఓ పెళ్ళి తెచ్చిన తంటాకు ఊరంతా క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. టెస్టులు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరో 18 మందికి పాజిటివ్ రావడంతో మొత్తం కేసులు 68 కి చేరాయి. 15 రోజుల క్రితం జరిగిన ఓ వివాహ వేడుక ఫంక్షన్ లో హాజరైన వారికి ఒక్కొక్కరిగా కరోనా పాజిటివ్ అని తేలుతోంది.
తాజాగా మరో 17 మందికి వైరస్ నిర్ధారణ కాగా ఇప్పటిదాకా పెళ్లి కూతురు ,పెళ్లి కొడుకు సహా ఇప్పటి వరకు మొత్తం 67 మందికి కరోనా చేరినట్టయ్యింది. దీంతో వివాహ వేడుకకు హాజరైన వారిలో ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం గ్రామమంతా క్వారంటైన్ లోనే వివాహ వేడుకకు హైదరాబాద్ నుంచి జ్వరంతో వచ్చిన ఓ మహిళే కారణం అని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇక ఈ టెన్షన్ తో గ్రామంలో రెండు రోజుల నుంచి హెల్త్ క్యాంపు పెట్టి పరీక్షలు చేస్తున్నారు అధికారులు. చెక్ క్యాంపు లో భారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల గురించి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆరా తీసినట్టు తెలుస్తోంది.