ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పక్షాన చేరి ఓవరాక్షన్ చేశాడు : మంత్రి చెల్లుబోయిన

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అయితే.. తొలి రోజే టీడీపీ, వైసీపీ నేతల మధ్య అసెంబ్లీ వేదికగా రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేస్తూ చేసిన సైగలకు వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సభాపతి టీడీపీ నేతలను ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు. అయితే.. ఈ క్రమంలో.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారని, స్పీకర్ ఛైర్ కు విలువ ఇవ్వకుండా సభాపతి పట్ల అమర్యాదగా నడుచుకున్నారన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పక్షాన చేరి ఓవరాక్షన్ చేశాడని, చంద్రబాబు ప్రజాధనం ఏ విధంగా లూటీ చేశారో కోర్టుకు అందించామన్నారు మంత్రి చెల్లుబోయిన.

అంతేకాకుండా.. ‘ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ వాదించినా కేసులో ఆధారాలున్నాయి కాబట్టే జడ్జిగారు రిమాండ్ విధించారు. బాలకృష్ణ తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించడం దురదృష్టకరం. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజాస్పందన వస్తుందని ఊహించి భంగపడ్డారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ను తెచ్చుకున్నారు. సభలో ప్రజల హక్కులను కాలరాసేలా టీడీపీ నేతలు వ్యవహరించారు.

 

సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ నేతలు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవులు సెల్ ఫోన్ తో చిత్రీరించాలని చూశారు. సభ నుంచి బయటికి వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ నేతలు మీసాలు తిప్పినా ..తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు.
చర్చకు రమ్మని కోరితే వచ్చేందుకు టీడీపీ నేతలకు ధైర్యం లేదు. చర్చించేందుకు టీడీపీ నేతల దగ్గర విషయం లేదు. అందుకే సభలో అల్లరి చేస్ బయటికి పోవాలనే గందరగోళం సృష్టించారు. నేటి టీడీపీ నేతల తీరు శాసన సభ చరిత్రలోనే దురదృష్టకరం’ అని మంత్రి చెల్లుబోయిన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version