రేపు ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ

-

రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూలపేట ఓడ రేవు నిర్వాసితులకు సహాయ, పునరావాసం, బలవర్ధకమైన బియ్యం పంపిణీ, దిశా బిల్లు పై ప్రశ్నలు జరుగనున్నాయి. దేవాలయ భూముల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్, నవ రత్నాలు – పేదలందరికీ ఇళ్ళు, అంశాల పై, నూతన వైద్య కళాశాలల్లో ఫీజులు, మహిళా సాధికారత అంశాల పై ప్రశ్నలపై చర్చ జరుగనుంది. రేపు ఉదయం పది గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంతో పెద్దల సభ ప్రారంభం కానుంది. ప్రభుత్వ రుణాలు, కేజీ బేసిన్ లో భూగర్భ జలాల కలుషితం, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు, కళ్యాణ్ మస్తు, హజ్ యాత్ర, డీఎస్సీ నోటిఫికేషన్ అంశాల పై మండలిలో ప్రశ్నలు జరుగనున్నాయి.

ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీలో బాలయ్య అసభ్య పదం వచ్చేలా సైగలు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని చర్చించేందుకు టీడీపీ సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో సభ నుంచి బయటకు వస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ నేతల వైపు చేతిని చూపిస్తూ అసభ్యకరంగా సైగ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.టీడీపీ అభిమానులు మాత్రం బాలయ్య సైగలతో ఖుషీ అవుతున్నారు. బాలయ్య బాబు నుంచి ఇలాంటి మాస్ వార్నింగ్.. మాస్ పాలిటిక్స్ కోసం ఇన్నాళ్లు వెయిటింగ్ అంటున్నారు. వైసీపీ నేతలకు ఇచ్చిన బాలయ్య మాస్ వార్నింగ్ వీడియోను ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version