టీమిండియా నయా సంచలనం, గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన దీపక్ చాహర్ 2022 ఐపీఎల్ వేలం లో హాట్ కేక్ అయ్యాడు. అతడిని దక్కించుకోవడానికి హైదరాబాద్, ఢిల్లీ అలాగే రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థుడు దీపక్ చాహర్. దీంతో ఆల్రౌండర్ కోటాలో అతడిని దక్కించుకోవడానికి రెండు ఫ్రాంచైజీలు నువ్వా…నేనా అన్నట్టుగానే వేలంలో పాల్గొన్నాయి.
చివరికి అతడిని 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. 2021 సీజన్ లో దీపక్ చాహర్ ను కేవలం 80 లక్షలు మాత్రమే కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ సీజన్ లో అతని కనీస ధర 2 కోట్లూగా ఉంది. గతంతో పోలిస్తే దీపక్ చాహర్ ఇప్పుడు 13 రేట్లు ఎక్కువకు ధర కు అమ్ముడు పోయాడు. అటు రికార్డు ధరలో ఇషన్ కిషన్ ను ముంబాయి ఇండియన్స్ రూ. 15.25 కోట్లు వెచ్చించింది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఇదే అత్యధికం. అలాగే నికోలస్ పూరన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 10.75 కోట్లు కుమ్మరించింది.