చిరపుంజి ఒకటి..
ఎటు చూసినా పచ్చదనం తివాచీ పరుచుకున్నట్టు కనిపించే అందమైన వాతావరణం. లీలగా ఒంటిని తాకి వెళ్లె చిరుగాలులు, మనకోసమే నింగి నుంచి రాలిపడుతున్నట్టు అనిపించే చిరుజల్లలు చిరపుంజిలో చూడొచ్చు. మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగుకు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీ ఓ అందమైన ప్రకృతి నిలయం. చిరపుంజీని చిర్రాపుంజి అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతిగాంచింది. దీనికి సమీపంలో ఉండే మాసిన్రామ్‌లో అత్యధిక వర్షపాతం ఉంటోంది. చిరపుంజీ అసలు పేరు సొరా, దీన్ని చురా అని బ్రిటిష్ వారు పిలిచేవారు. కాలక్రమేణా అది చిరపుంజీగా మారింది. చిరపుంజీకి వెళ్లాలంటే ముందు షిల్లాంగ్‌కు చేరుకోవాలి.