తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ది దొంగ దీక్ష అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు డీ కే అరుణ అన్నారు. ఆయన ఒక దొంగ గాంధీ అని డీకే అరుణ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు సెగ ముఖ్య మంత్రి కేసీఆర్ కు బాగానే తగిలిందని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడి పోవడం తో కేసీఆర్ దిమ్మ తిరిగిందని డీ కే అరుణ అన్నారు. 12 వందల మందిని చంపిన కేసీఆర్ ఈ రోజు శుద్ధ పూస లెక్క మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ ఉప ఎన్నికల వల్లే కేసీఆర్ కళ్లు తెరిచాయని అన్నారు. అందుకే వరుసగా మీడియా ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. గెలుపు కోసం కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు ఓటమి గెలుపు లు సహజం అని అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దళిత బంధు ను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి మాత్రమే కాదు.. ఆయన దేశ ద్రోహి అని అన్నారు. కేసీఆర్ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆయన ఆహంకారం తగ్గించు కోక పోతే భవిష్యత్తు లో మూల్యం చెల్లించు కుంటారని డీ కే అరుణ అన్నారు.