ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇంఛార్జి మంత్రి కలిసి రేషన్ కార్డులు పంపిణి చేయాలని ఆదేశించారు.

ఇక అటు కలెక్టర్లకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఏ మాత్రం అజాగ్రత్త, నిర్లక్ష్యంగా ఉన్నా ఎంతటి అధికారినినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తెలిపారు. రైతులు, పేద ప్రజలకు అధికారుల మూలానా ఏమాత్రం నష్టం జరిగినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.