హరిహర వీరమల్లు ప్రీమియర్, సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల షోకు అనుమతి ఇచింది రేవంత్ రెడ్డి సర్కార్. ముందు రోజు రాత్రి షోకు టికెట్ ధర రూ.600 ఉంటుంది.

సినిమా విడుదల రోజు నుండి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.150 వరకు పెంపు ఉంటుంది. 28 నుండి ఆగస్టు 02 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.106 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.