నాకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: చీకోటి

-

తనకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చీకోటి ప్రవీణ్ తెలిపారు. హిట్ మెన్ అనే విదేశీ యాప్ లో సుపారీ ఇచ్చినట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని అన్నారు. బెదిరింపులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. భద్రత కోసం హైకోర్టులోనూ పిటిషన్ వేసినట్లు వివరించారు. విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

క్యాసినో కేసులో ఈడీ విచారణ జరుగుతోంది. నాకు అన్ని పార్టీల నాయకులతో పరిచయాలున్నాయి. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఈడీ విచారణకు ఎప్పుడు రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా ప్రాణానికి హాని ఉంది. నాకు భద్రత కల్పించండి. భద్రత కోసం హైకోర్టులో పిటిషన్ కూడా వేశాను. ఇంతలోనే విదేశాల నుంచి నన్ను చంపడానికి సుపారీ ఇచ్చినట్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అని చీకోటి ప్రవీణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version