ఏ రాజకీయ పార్టీలోనైనా సీనియర్ నాయకుల వల్ల పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి…వారి సలహాలు సూచనలతో పార్టీ మరింత బలపడాలి తప్ప..వారు పార్టీకి భారంగా మారకూడదు…వారి వల్ల పార్టీకి నష్టం జరగకూడదు. అయితే టీడీపీలో ఉండే సీనియర్ల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగేలా ఉంది. ఇప్పటికీ కొందరు నేతలు పార్టీకి భారంగా తయారైన చెప్పొచ్చు…అసలు ఒకప్పుడు వారు పార్టీకి బాగా ప్లస్ అయ్యారు..అందులో ఎలాంటి డౌట్ లేదు…కానీ ఇప్పుడు వారిని ప్రజలు ఆదరించడం లేదు..దీని వల్ల పార్టీకి నష్టం జరిగేలా ఉంది.
పోటీ నుంచి తప్పుకుని పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి…అలా కాకుండా ఇప్పటికీ పోటీ చేయడానికి రెడీ అవ్వడం వల్ల పార్టీకే నష్టం జరిగేలా ఉంది. పైగా సీటు కోసం ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే అని చంద్రబాబు ప్రకటించారు. యువతకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు…వారు యాక్టివ్ గా పనిచేయగలుగుతారు…ప్రజల్లోకి వేగంగా వెళ్తారు…ప్రజలకు దగ్గర అవ్వగలరు.
కానీ సీనియర్ల పరిస్తితి అది కాదు…దూకుడుగా పనిచేయలేరు…అలాగే తాము సీనియర్ నేతలమనే భావన ఉండటం వల్ల త్వరగా ప్రజలతో మమేకం కాలేరు. దీని వల్ల పార్టీక చాలా నష్టం జరుగుతుంది…ఎప్పుడో తమన ప్రజలు ఆదరించారని, ఇప్పటికీ ఆదరిస్తారు అనుకుంటే పొరపాటే అవుతుంది. మొత్తానికైతే కొందరు సీనియర్ల వల్ల టీడీపీకి ఇబ్బంది అయ్యేలా ఉంది. ఇప్పటికే కొందరు నేతలకు సీటు దక్కదని బాబు హింట్ ఇచ్చేశారని తెలుస్తోంది.
అయినా సరే వారు నియోజకవర్గాల్లో వేరే నేతలతో పోరుకు తెరలేపుతున్నారు. ఇప్పటివరకు యాక్టివ్ గా తిరగకుండా…ఈ మధ్య కాస్త హడావిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఇదే పరిస్తితి ఎన్నికల వరకు కొనసాగితే..మళ్ళీ టీడీపీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికి సీనియర్లే సైకిల్ ని ముంచేలా ఉన్నారు.