విమానం ఎక్కాలని చిన్ననాటి కోరిక.. ఇంటినే విమానంగా నిర్మించేశాడు..!!

-

చాలామందికి విమానం ఎక్కాలని కోరిక ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు అందరూ ఎక్కుతారు.. కానీ అది మన గమ్యస్థానం వచ్చేవరకే కదా..! అదే విమానాన్ని ఇంటికే తెచ్చుకుంటే.. కాదు కాదు.. ఇంటినే విమానంగా మార్చేస్తే అనుకున్నాడో వ్యక్తి.. 30 ఏళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో.. విమానం లాంటి ఇంటిని నిర్మించాడు. కాంబోడియాకు చెందిన ఓ వ్యక్తి ఇంటిని విచిత్రంగా నిర్మించాడు. ఇప్పుడు ఈ ఇళ్లు అందరిని ఆకర్షిస్తుంది.

ఇళ్లు అనేక రకాలు ఉంటాయి. కొన్ని భారీ ఖర్చుతో ..విలాసవంతంగా ఉండే ఇంటిని నిర్మించుకునే వాళ్లను చూశాం. కాని కాంబోడియాలో సీమ్‌ రీప్‌ అనే నగరానికి చెందిన చార్చ్ పాయు తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేసి మరీ విమానాన్ని పోలిన ఇంటిని నిర్మించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సుమారు 20వేల అమెరికన్ డాలర్లు ఖర్చు చేసి ఓ ప్రైవేట్ జెట్‌గా ఇంటిని మార్చేశాడు. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి..

43సంవత్సరాల వయసున్న చార్చ్‌కి ముగ్గురు సంతానం. విమానంలో ప్రయాణించడం కంటే అలాంటి ఇంటిని నిర్మించుకోవాలని సుమారు 30ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ ఫ్లైట్ హౌస్‌కి ఖర్చు చేశాడు. ఈ విమానం ఇంటిని నిర్మించడానికి ఏడాది సమయం పట్టిందని ఇది తన కలల సౌదమని అంటున్నాడు చార్చ్.

విమానం డిజైన్‌లో నిర్మించిన తన ఇంట్లో బెడ్రూం, డైనింగ్‌ రూమ్, బాత్రూం అన్నీ వేర్వురుగా ఉన్నాయి.. తాను ఎలాగైతే ఇల్లు కట్టాలని కలలు కన్నాడో అదే విధంగా కట్టుకున్నానని సంతోషంగా చెబుతున్నాడు. ఇల్లు విమానంలా కట్టుకోవాలని నిర్ణయించుకోగానే ఇంటర్‌నెట్‌లో ప్రైవేట్‌ జెట్‌ల వీడియోలు, వాటిని ఎలా నిర్మిస్తారనే విషయాలు తెలుసుకున్నాడట…ఇక డిజైన్‌ ఆధారంగా ఇంటిని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం చార్చ్‌ నిర్మించుకున్న ఇల్లు అందర్ని ఆకర్షిస్తోంది. ఆ ఇంటి దగ్గర నిల్చొని ఓ ఫోటో దిగుతున్నారు, కొందరైతే యజమాని చార్చ్‌తో కలిసి ఇంటి దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ విమానం హౌస్‌ని చూడటానికి వచ్చే వాళ్ల దగ్గర టికెట్‌ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఐడియా భలే ఉంది కదా… ఇంటి దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడానికి 50 సెంట్ల నుండి $ 1 వరకు వసూలు చేస్తున్నట్లు అతను చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version