అమరావతి ప్రజారాజధానిగా గెలుస్తుంది… చరిత్రలో నిలుస్తుందని టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. తరతరాలుగా బతుకు ఆధారమైన భూముల్ని ప్రజారాజధాని అమరావతి కోసం ఇచ్చిన మీ త్యాగం వృథా పోదు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో మీరు చేపట్టిన అలుపెరుగని ఉద్యమానిదే అంతిమ విజయం అన్నారు లోకేష్.
మూడుముక్కలాట సర్కారు కుట్రలు, నిర్బంధాలు, దాడులకి ఎదురొడ్డి నిలిచి 1200 రోజులుగా పోరాడుతున్న మీ అందరికీ ఉద్యమాభివందనాలు. అమరావతి ప్రజారాజధానిగా గెలుస్తుంది. చరిత్రలో నిలుస్తుంది. జై ఆంధ్రప్రదేశ్-జయహో అమరావతి అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇసుక దందాకు ఇదే నిదర్శనం.ఒకేసారి తొమ్మిది ఇసుక టిప్పర్లు ఎలాంటి పర్మిట్ లేకుండా ఇసుకను బెంగళూరు తరలిస్తున్నారు. పేరుకే జేపీ కంపెనీకి కాంట్రాక్ట్..కానీ చిత్రావతిలో ఆధిపత్యం మొత్తం కేతిరెడ్డిదేనని ఫైర్ అయ్యారు.
తరతరాలుగా బతుకు ఆధారమైన భూముల్ని ప్రజారాజధాని అమరావతి కోసం ఇచ్చిన మీ త్యాగం వృథా పోదు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో మీరు చేపట్టిన అలుపెరుగని ఉద్యమానిదే అంతిమ విజయం.(1/2)#1200DaysOfAmaravatiProtests pic.twitter.com/9m3GaOyQbR
— Lokesh Nara (@naralokesh) March 31, 2023