స‌మ్మ‌క్క-సార‌ల‌మ్మ వివాదం : చిన‌జీయ‌ర్ క్షమాప‌ణ‌లు చెప్పు.. పరిపూర్ణానంద స్వామి డిమాండ్

-

ఆదివాసీ దేవ‌త‌లు అయిన స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన చిన జీయ‌ర్ స్వామికి వ్య‌తిరేకంగా భ‌క్తులు, రాజ‌కీయ నాయ‌కులు తీవ్రంగా స్పందించారు. తాజా గా ప‌రిపూర్ణానంద స్వామి కూడా చిన జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌లపై ఘాటుగా స్పందించారు. స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మల‌పై చిన జీయ‌ర్ స్వామి చేసిన వ్యాఖ్య‌లను తాను ఖండిస్తున్నాన‌ని తెలిపారు. చిన జీయ‌ర్ స్వామి వెంట‌నే హిందూ స‌మాజానికి క్షమాప‌ణ‌లు చేప్పాల‌ని డిమాండ్ చేశారు.

స‌మ్మ‌క – సార‌ల‌మ్మ ల‌ను తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాకుండా దేశంలో ప‌లు న‌గ‌రాల నుంచి కూడా కోట్లాది మంది భ‌క్తులు ఆధ‌రిస్తున్నార‌ని అన్నారు. కాగ స‌మ్మక్క‌-సార‌ల‌మ్మ పేరుతో బ్యాంకులు పెడితే స‌మ‌స్య ఎంట‌ని ప్ర‌శ్నించారు. సమ్మ‌క్క – సార‌ల‌మ్మ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన చిన జీయ‌ర్ స్వామిపై స్వామిజీలు అంద‌రూ స్పందించాల‌ని డిమాండ్ చేశారు. కాగ చిన జీయ‌ర్ స్వామి ఏ సంద‌ర్భంలో అలా మాట్లాడారో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు.

కానీ ఆ వ్యాఖ్య‌ల‌ను తాను ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. కాగ చిన జీయ‌ర్ స్వామి చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆదివాసి సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. చిన జీయ‌ర్ స్వామిపై ఏకంగా అట్రాసిటి కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ‌త కొద్ది రోజుల నుంచి చిన జీయ‌ర్ స్వామి దిష్టి బోమ్మ‌ల‌ను కూడా ద‌గ్ధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version