హోలీ రోజున ఈ వాస్తు పద్ధతలు పాటిస్తే ఆర్థిక సమస్యలు ఉండవట..!

-

హోలీ వచ్చేస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందగా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. అయితో ఈరోజు కొన్ని పనులు చేయటం వల్ల మంచి జరుగుతుందట.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. హోలీ రోజున కొన్ని వాస్తు సంబంధిత పద్ధతులు పాటిస్తే జీవితంలో ఎదుర్కొనే కష్టాలు తీరుతాయట. కుటుంబ పురోగతి, ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం కలుగుతుందట. అలాగే.. ఆర్థిక సమస్యలు సైతం తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఎలాంటి వాస్తు నిబంధనలు పాటించాలో ఒకసారి చూద్దాం..

హోలీ రోజున సంపదల దేవతగా పేరుగాంచిన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి బయట పసుపు, ఎరుపు రంగుతో రంగోలిని వేయాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడంతో పాటు.. అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయట.

ఇంట్లో, కుటుంబంలో ఉన్న ప్రతికూలతను తొలగించడానికి.. హోలీ రోజున ఇంట్లో మొక్కలు నాటాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కలు నాటడం ద్వారా కూడా ఇంట్లో ఉన్న దోషాలు పోతాయి.

భార్య, భర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నట్లయితే.. హోలీ రోజున రాధా-కృష్ణుల చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలి. శ్రీకృష్ణుడు, రాధ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. తద్వారా, భార్యభర్తల మధ్య ఉన్న ఘర్షణలు పోతాయట.

డబ్బు కొరతను అధిగమించడానికి వాస్తు శాస్త్రంలో చాలా పరిష్కారాలు ఉన్నాయి. అయితే, హోలీ రోజున మీ కార్యాలయంలో, మీ ఇంట్లో సూర్య భగవానుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. సూర్యుడి ఫోటోను ఏర్పాటు చేసేటప్పుడు పూర్తి భక్తిశ్రద్దలతో పూజించాలి.

వాస్తు ప్రకారం.. సూర్యుడు ఉదయించే చిత్రాన్ని కార్యాలయాల్లో, ఇంట్లో, దుకాణంలో తూర్పు దిశలో మాత్రమే పెట్టాలట.

హోలీ రోజు ఈ చిట్కాలు పాటించేయండి మరీ. అడ్వాన్స్ గా హ్యాపీ హోలీ బాస్..!

గమనిక: పైన పేర్కొన్న వివరాలను మత విశ్వసాలు, జ్యోతిష్య గ్రంధాల ఆధారంగానే అందించాం. మనలోకం సొంతంగా రాసింది కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version