ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా రూ. 228 కోట్లు విరాళం

-

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అగ్రరాజ్యం అమెరికా నిధులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా ఎదుర్కొవడంలో డబ్ల్యూహెచ్ఓ తప్పటడుగు వేసిందని.. చైనాకు మద్దతుగా నిలిచిందని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. దాదాపు 60 నుంచి 90 రోజుల వరకు డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేసే అవకాశం ఉన్నట్ట వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. దీంతో డబ్ల్యూహెచ్ఓకు కొంత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అమెరికా ఫండింగ్ నిలిపివేయడం.. ఆ సంస్థ నిర్వహించే ప్రధానమైన సేవలపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేశారు.

అయితే ఈ సమయంలో డబ్ల్యూహెచ్ఓను అండగా నిలవడానికి చైనా ముందుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆదనంగా 30 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 228 కోట్లు) విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యానికి డబ్ల్యూహెచ్ఓ ఎంతగానో కృసి చేస్తుందని.. ఆ సంస్థకు చైనా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఇదివరకు కరోనాపై పోరాడేందుకు 20 మిలియన్ డాలర్లు డబ్ల్యూహెచ్ఓకు చైనా అందజేసిందని గుర్తుచేశారు. దానికి అదనంగా 30 మిలియన్ డాలర్లు అందజేయనున్నట్టు తెలిపారు.

కాగా, కరోనాకు సంబంధించిన విషయాల్లో చైనా, డబ్ల్యూహెచ్ఓ వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే చైనా మాత్రం కరోనా గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది తామేనని చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version