చైనా యాప్స్‌పై నిషేధం సబబే.. ఎందుకో చదవండి..!

-

టిక్‌టాక్‌ను నిషేధించండపై కొందరు సో కాల్డ్‌ మేథావులు, టిక్‌టాక్‌ స్టార్లు ఎంతో మదన పడిపోతున్నారు. కానీ అసలు వాస్తవాలు వేరే. అలాంటి కుహనా మేథావులకు నిజాలు తెలియవు. ఎన్నో సంవత్సరాల తరబడి చైనా వాడు మన దేశంలో ఎలా పాతుకుపోయాడో ఈ ఒక్క ఉదాహరణ మనకు తెలియజేస్తుంది. టిక్‌టాక్‌ను నిషేధించడం సబబే అని కింద చెప్పిన విషయాలను చదివితే మీకే అర్థమవుతుంది. తరువాత మీరు కూడా అందుకు మద్దతు ఇస్తారు..

ఆలోచన మారితే.. దేశం మారుతుంది..

టిక్ టాక్ కంపెనీ భారత్ నుండి ఒక సంవత్సరంలో సుమారుగా రూ.1400 కోట్ల ఆదాయం పొందుతుంది. ఇప్పుడు ఇండియాలో నిషేధంతో ఈ ఆదాయం కోల్పోవడంతోపాటు 100 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఇష్యూకి వెళ్దాం అనుకున్న ప్రణాళిక కూడా బోల్తా కొట్టింది. 100 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారుగా 7,50,000 కోట్లు.. అంటే ఆ మేరకు వారికి నష్టం కలిగినట్లు కాదా..? ఏడున్నర లక్షల కోట్ల IPO ప్రణాళిక మూలకు పడడం చిన్న విషయం కాదు..

మనదేశాన్ని ఆక్రమించు కోవడానికి ప్రయత్నిస్తూ, మనదేశ సైనికులను కుట్ర పూరితంగా పొట్టన పెట్టుకున్న చైనా దేశానికి మనదేశం నుండి ఒక్క రూపాయి ఆదాయం తగ్గినా మనం సంతోషించాలి కానీ ఏడ్వడం ఎందుకు..? నీకు అమోఘమైన తెలివి తేటలు ఉంటే నువ్వే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి టిక్ టాక్‌ను తలదన్నే యాప్‌ను రూపొందించి ఆ ఆదాయమేదో నువ్వే పొందవచ్చు కదా..?

59 యాప్ లను నిషేధించారు అంటే కొత్తగా ఇండియాలో 59 స్టార్టప్ కంపెనీలకు అవకాశం దొరికింది.. ఆ కంపెనీ మీరు, మీ పిల్లలో, మీ సోదరుడు లేదా మీ స్నేహితుడు ప్రారంభిస్తే మీకే లాభం కలుగుతుంది కదా..? కొత్తగా టిక్ టాక్ లాంటి యాప్ మీరు తయారుచేయకుండా మిమల్ని ఎవ్వరూ అడ్డుకోవడం లేదు కదా..?

అసలు చైనా వాడు చేసింది ఏమిటి..? అమెరికా సిలికాన్ వ్యాలీలో పురుడు పోసుకున్న స్టార్టప్ కంపెనీల బిజినెస్ మోడల్స్ కాపీ కొట్టి వాళ్ళ దేశంలో ఆ కంపెనీలను అడుగుపెట్టడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించి కాపీ సంస్థలను చైనా వారితో పెట్టించింది.. అమెజాన్ వంటి సంస్థకు కాపీ ఆలీబాబా అలాంటిదే.. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల, వేల ఉదాహరణలు ఉన్నాయి..

ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మనం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి మరో భారతీయ కంపెనీలో కి వెళ్తేనే ఆ డబ్బులు తిరిగి ఇండియాలో ఏదో రూపంలో పెట్టుబడిలోకి మారి మరింత మందికి ఉపాధి కల్పిస్తుంది.. మనదేశం ఆర్థికంగా పురోగమిస్తుంది. మన డబ్బులతో విదేశీయులు మరీ ముఖ్యంగా శత్రువుల జేబులు నింపడమంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే..

#Vocal_for_Local #Support_Indian_Startups
దేశం కోసం.. ధర్మం కోసం.. ధన్యవాదాలు

గమనిక :- పైన ఇచ్చిన పోస్టు మేం రాసింది కాదు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. భావం చెడకుండా దాన్ని అలాగే పబ్లిష్‌ చేశాం. ప్రస్తుతం చైనా యాప్‌లపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి పోస్టులను ప్రతి ఒక్కరూ చదవాలని.. జనాలకు చేరాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టును మా సైట్‌లో పబ్లిష్‌ చేయడం జరిగింది. దీన్ని ఎవరు రాశారో తెలియదు. వారి పేరు తెలియదు కనుక క్రెడిట్స్‌ ఇవ్వడం సాధ్యపడడం లేదు. ఎవరో తెలిస్తే చెప్పండి. క్రెడిట్స్‌ ఇస్తాం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version